ప్రముఖ నిర్మాత మృతి

By iQlikMovies - October 31, 2017 - 12:28 PM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు (92) ఇక లేరు.

వివరాల్లోకి వెళితే, కమ్యునిస్ట్ యోధుడిగా సినీ నిర్మాతగా అందరికి పరిచయస్తుడైన నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ఈ ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన లివర్ క్యాన్సర్ తో భాదపడుతున్నట్టు సమాచారం.

 

పూర్ణచంద్రరావు గారు నిర్మాతగా- ఆడపడుచు, తండ్రికొడుకులు, స్త్రీ వంటి చిత్రాలని నిర్మించారు. ఈయన ఆఖరిగా నిర్మించిన చిత్రాలు- వెంకీ (2004) & అవునన్నా కాదన్నా (2005).

ఈయన మృతి పట్ల ఇటు రాజకీయ రంగ ప్రముఖులు అటు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి తెలియచేశారు. ఈ సందర్భంగా www.iqlikmovies.com తరపున పూర్ణచంద్రరావుగారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS