దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ ఓ సినిమాని నిర్మిస్తోంది. ప్రియాంకా దత్ నిర్మాత. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఓ హీరోయిన్ గా ఇది వరకే పూజా హెగ్డే ఎంపికైంది. రెండో నాయికగా రష్మికని తీసుకున్నారని ప్రచారం జరిగింది. రష్మికతో చిత్రబృందం సంప్రదింపులు కూడా జరిపింది. అయితే ఏమైందో, ఏంటో.. ఇప్పుడు రష్మిక స్థానంలో రాశీఖన్నా వచ్చి చేరింది.
ఈ సినిమాలో రాశీ దాదాపుగా ఖాయమైపోయింది. అధికారిక సమాచారం ఒక్కటే రావాల్సివుంది. 1980 నాటి ప్రేమకథ ఇది. దుల్కర్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. కథానాయికలిద్దరివీ ప్రాధాన్యం ఉన్న పాత్రలే. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.