కాస్త డోస్‌ పెంచిన 'ఉమాదేవి'!

మరిన్ని వార్తలు

టీవీ ఆర్టిస్టుగా పాపులర్‌ అయిన ముద్దుగుమ్మ అవికాగోర్‌ 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో బిగ్‌ స్క్రీన్‌పై కాలు మోపింది. హీరోయిన్‌గా తొలి సినిమాలో 'ఉమాదేవి' పాత్రలో నటించి, కాదు కాదు జీవించి తెలుగు ఆడియన్స్‌ని ఓన్‌ చేసేసుకుంది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలతోనే మాయమైపోయింది. బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ కూడా బిగ్‌ స్క్రీన్‌పై పెద్దగా సత్తా చాటింది లేదు.

 

కానీ, ప్రస్తుతం తనకి బాగా కలిసొచ్చిన బుల్లితెరపైనే హవా చూపిస్తోంది. బిగ్‌ స్క్రీన్‌పై ఒకవేళ ఎంత బిజీ అయినా, బుల్లితెరను మాత్రం వదిలి పెట్టనని గతంలోనే చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే మళ్లీ బిగ్‌ స్క్రీన్‌పై మెరిసిపోవాలనే ఆలోచన చేస్తోందట. అందుకోసం సోషల్‌ మీడియాలో డిఫరెంట్‌ యాంగిల్స్‌లో హాట్‌ పిక్స్‌, వీడియోస్‌ పోస్ట్‌ చేసి, దర్శక, నిర్మాతలకు గాలమేస్తోంది.

 

అన్నట్లు ఈ మధ్య మన ఉమాదేవి బ్యూటిఫుల్‌గా డాన్సులు కూడా చేస్తోందండీ. ఆ డాన్సింగ్‌ వీడియోలు కూడా హాట్‌ హాట్‌గా సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తెలుగుతో పాటు, హిందీ, కన్నడ సినిమాల్లోనూ సెలెక్టివ్‌గా సినిమాలు చేసిన ఈ గుజరాతీ బ్యూటీ త్వరలోనే ఓ సౌత్‌ సినిమాలో సందడి చేయనుందనీ తెలుస్తోంది. ప్రస్తుతం చేతినిండా టీవీ సీరియల్స్‌తో బిజీగా గడుపుతోన్న అవికా త్వరలో ఓ సినిమా కోసం ఫుల్‌ డోస్‌ గ్లామర్‌ రోల్‌లో దర్శనమివ్వనుందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS