డేంజర్‌ గేమ్‌ ఆడుతోన్న మిల్కీ బ్యూటీ!

మరిన్ని వార్తలు

ఈ మధ్య 'ఎఫ్‌ 2'తో గయ్యాలీ భార్య పాత్రలో కనిపించి, వెంకటేష్‌ని తెగ ఇబ్బంది పెట్టేసిన మిల్కీ బ్యూటీ తమన్నాని ఇప్పుడు ఓ సైకో ఇబ్బంది పెడుతున్నాడు. ఓ పెద్ద బంగ్లా. అందులో ఒంటరిగా ఉంటోన్న తమన్నా. ఓ సైకో కిల్లర్‌ కంటికి చిక్కితే, కనిపించిన వారిని చంపకుండా వదిలి పెట్టని ఆ సైకో మరి మన తమన్నాని వదిలిపెట్టాడా.? ఆ సైకో నుండి తప్పించుకోవడానికి తమన్నా ఏం చేసింది.? ఎంత కష్టపడింది.? ఈ డేంజర్‌ గేమ్‌ నుండి ఎలా బయటపడింది.? ఇవన్నీ తెలియాలంటే 'ఖామోషీ' సినిమా చూడాలి.

 

ప్రభుదేవా, తమన్నా కీలక పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మన తెలుగు దర్శకుడు చక్రి తోలేటి తెరకెక్కించాడు. లేటెస్ట్‌గా విడుదలైన టీజర్‌ భయపెట్టేస్తోంది. ఈ మధ్య హారర్‌ సినిమాలంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. అందుకే హారర్‌ అంటే ఇదీ.. అని మళ్లీ గుర్తు చేసేలా ఇదివరకటి రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉందీ 'ఖామోషీ' సినిమా ఆర్‌ఆర్‌. ఇంతకీ సైకో పాత్ర పోషించిందెవరో తెలుసా.? ప్రభుదేవా. టీజర్‌లో ప్రభుదేవానీ, తమన్నాని మాత్రమే చూపించారు.

 

సైకోలా ప్రభుదేవా హావభావాలు, దారుణంగా భయపడుతోన్న తమన్నా..అంతకన్నా దారుణంగా చూస్తున్న ఆడియన్స్‌ని భయపెట్టే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇవే ఉన్నాయి ఈ టీజర్‌లో. చూడాలి మరి, ఈ హండ్రెడ్‌ పర్సంట్‌ హారర్‌ మూవీతో తమన్నా, ప్రభుదేవా ఎంతగా ఆడియన్స్‌ని భయపెడతారో. మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు హారర్‌ కామెడీ జోనర్‌లో వీరిద్దరి కాంబినేషన్‌లోనే తెరకెక్కిన 'అభినేత్రి 2' కూడా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS