మామూలుగా బ్రాండ్ అంబాసిడర్లు అంటే, షోరూమ్ ఓపెనింగ్స్‌కి మాత్రమే కనిపిస్తారు. అప్పుడప్పుడూ వీలు చిక్కితే ఆయా సంస్థల్ని తమదైన శైలిలో ప్రమోట్ చేస్తుంటారు. కానీ విజయ్ దేవరకొండ ఏం చేసినా స్పెషలే కదా. మనోడు 'కె.ఎల్.ఎమ్' ఫ్యాషన్ మాల్‌కి బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి తెలిసిందే. రౌడీ బ్రాండ్ అంబాసిడర్ కావడంతోనే ఆ మాల్‌కి అంత పాపులారిటీ వచ్చిందనడం నిక్కర్చయిన నిజం. అందుకేనేమో ఈ సంస్థ వాళ్లు విజయ్‌ని జస్ట్ ఓ బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే చూడడం లేదు.
ఏకంగా ఆయన బర్త్‌డే సందర్భంగా భారీ భారీ హోర్డింగ్స్ డిజైన్ చేయించి, నగరంలోని అత్యంత రద్దీ కూడళ్లలో పెట్టించారు. ఇలా జరగడం బహుశా ఇది తొలిసారి కావచ్చు. విచిత్రమేంటంటే, ఈ హోర్డింగులు అదే రోజు విడుదలైన సూపర్‌స్టార్ 'మహర్షి' సినిమా హోర్డింగుల్ని సైతం వెల వెలబోయేలా చేసేయడం ఆశ్చర్యకరం. ఇప్పటికే విజయ్ దేవరకొండ క్రేజ్‌నీ, స్టార్‌డమ్‌నీ తట్టుకోవడం స్టార్ హీరోల వల్ల కాలేకపోతోంది
దీంట్లో మళ్లీ ఇలాంటి ఎఫెక్టులంటే మనోడి హవా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 'మహర్షి' రిజల్ట్‌పై మహేష్‌కి ముందుగానే అనుమానం ఉండి ఉండొచ్చు. అందుకే తన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి విజయ్‌ని తోడు తెచ్చుకున్నాడు కాబోలు అంటూ సినిమా విడుదలయ్యాక మహేష్‌పై చూజాయగా కొన్ని కామెంట్లు కూడా వినిపించాయి. ఏది ఏమైతేనేం. హీరోగానే కాదు, బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మనోడు సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు. మరోసారి సెన్సేషన్ అయిపోయాడు