ఆక్ట‌టుకుంటోన్న`ఎంత మంచివాడ‌వురా` మెలోడీ.

By iQlikMovies - December 19, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

నందమూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా  'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత‌మంచివాడ‌వురా`. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్‌గా మెలోడీ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

 

"అవునో తెలియ‌దు కాదో తెలియ‌దు ఏం న‌వ్వో ఏమో.." అంటూ సాగే ఈ పాటలో హీరోపై త‌న‌కున్న ప్రేమ‌ను హీరోయిన్ తెలియ‌జేస్తుంది. బ్యూటీఫుల్ లొకేష‌న్స్‌లో ఈ పాట‌ను పిక్చ‌రైజ్ చేశారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత గోపీసుంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ పాట‌ను  ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్ ఆల‌పించారు.

ఈ సంద‌ర్భంగా   నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ `` సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.  కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేష‌న్‌లో రూపొందిన బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ అంద‌మైన కుటుంబ క‌థా చిత్రాన్ని అద్భుత‌మైన ఎమోష‌న్స్‌తో అందమైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించాం. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయత‌లు, అనురాగాల‌ను తెలియ జేసే చిత్రమిది. రీసెంట్‌గా విడుద‌లైన `ఏమో ఏమో ఏ గుండెల్లో ..` అనే పాట‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుతమైన పాట వ‌చ్చింది. ఇప్పుడు మ‌రో సాంగ్‌ను విడుద‌ల చేశాం. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇది ల‌వ్‌సాంగ్  త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

 

చిత్ర సమర్పకులు  శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ  ‘‘హీరో, హీరోయిన్ మ‌ధ్య సాగే ల‌వ్ మెలోడీని రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్‌గా విడుద‌ల చేశాం. ఇప్ప‌టికే విడుద‌లైన మొద‌టి పాట‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన ఈ పాట‌ను శ్రేయా ఘోష‌ల్ ఆల‌పించారు. మంచి స్పంద‌న వ‌స్తుంది. త్వ‌ర‌లోనే మ‌ర్నిన్ని లిరిక‌ల్ వీడియో పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం రంజింపజేస్తుంది`` అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS