ఓవర్సీస్‌లో నాని మార్కెట్ సంగతి తెలిసిందే. అక్కడ నాని సినిమాలకు పిచ్చ క్రేజ్ ఉంది. అందుకే అక్కడ నాని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తాయి. తాజాగా నాని తొలిసారి నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం 'అ!'. ఈ సినిమాపై విడుదలకు ముందే అంచనాలు భారీగా నమోదయ్యాయి. అలాగే విడుదల తర్వాత కూడా ఆ అంచనాల్ని అందుకుంది నాని 'అ!.
విడుదలకు ముందే సినిమా కాన్సెప్ట్‌పై క్రియేట్ అయిన ఇంట్రెస్ట్‌కి ఓపెనింగ్స్ అదిరిపోయాయ్ ఈ సినిమాకి. అంతేకాదు ప్రీమియర్ షోలతో అమెరికాలో ఈ సినిమా సాధించిన వసూళ్లు అక్షరాలా 107,612 డాలర్లనీ, అక్కడి ట్రేడ్ వర్గాల నుండి అందిన సమాచారమ్. నిన్న అనగా ఫిబ్రవరి 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వైపుల నుండీ ఈ సినిమాకు పోజిటివ్ రివ్యూసే రావడంతో సినిమా సక్సెస్ టాక్‌ని సొంతం చేసుకుందనే చెప్పాలి. ఈ తరహా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్‌కి ఇంతగా ఆదరణ దక్కడం అభినందనీయమైన విషయమే. 'అ!' ని చూసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఓ తెలియని ఫీల్‌ని, సరికొత్త థ్రిల్‌ని కలిగించిందంటున్నారు 'అ!' సినిమా. నాని చెప్పినట్లుగా 'అ'లో ఊహించని సరికొత్త అంశాలు చాలా ఉన్నాయనీ విడుదల తర్వాత తెలిసింది. ఇదంతా చూస్తుంటే, ముందు ముందు టాలీవుడ్‌లో ఈ తరహా కాన్సెప్ట్ సినిమాలు పుట్టుకొచ్చేందుకు 'అ!' ఒక ఇన్స్‌పిరేషన్ అవుతుందనడం నిస్సందేహం. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ, ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.