సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ లో అలజడి రేపింది. బాలీవుడ్ లో బంధుప్రీతిని వేలెత్తి చూపించింది. బాలీవుడ్ లో తమకు జరిగిన అన్యాయాల గురించి ఒకొక్కరుగా మాట్లాడడం మొదలెట్టారు. నాగార్జున హీరోయిన్ అయాషా టకియా కూడా ఇప్పుడు గళం విప్పింది. సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఆయాషా. ఆ సినిమాలో గ్లామరెస్ గా కనిపించినా, తెలుగులో పెద్దగా కలసి రాలేదు. బాలీవుడ్ లో మాత్రం రాణించగలిగింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో ఆయాషా స్పందించింది.
తనని కూడా అణగద్రొక్కాలని చూశారని, తనపై ట్రోలింగ్ చేశారని, అవన్నీ ఎదుర్కొని తాను నిలబడగలిగానని చెప్పుకొచ్చింది. ఎవరైనా, ఎవరినైనా ఇబ్బంది పెడితే, అలా ఇబ్బంది పెట్టినవాళ్ల పేర్లు సోషల్ మీడియా వేదికగా బయటకు చెప్పాలని, అలాంటి వాళ్లని ఊరికే వదలకూడదని హితవు పలికింది. అయితే ఇది చెప్పినంత తేలిక కాదని, దానిక్కూడా ధైర్యం ఉండాలని, మనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదంటే, ఈ మాత్రం తెగువ చూపించాల్సిందేనని చెప్పుకొచ్చింది.