మరోసారి ఎన్టీఆర్ - మోహన్ లాల్ కాంబో?

మరిన్ని వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక ఓ బలమైన రాజకీయ నాయకుడి పాత్ర ఉందని, ఆ పాత్ర కోసం మోహన్ లాల్ ను నిర్మాతలు సంప్రదించారని సమాచారం అందుతోంది. ఒకవేళ ఈ పాత్రకు ఆయన కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా మరింత క్రేజీ ప్రాజెక్టుగా మారడం ఖాయం. ఎందుకంటే గతంలో మోహన్ లాల్ - ఎన్టీఆర్ కలిసి నటించిన 'జనతా గ్యారేజ్' బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఎన్టీఆర్ - మోహన్ లాల్ కాంబినేషన్ సీన్లకు భారీ ప్రేక్షకాదరణ దక్కింది. ఈ కాంబినేషన్ సెట్ అయితే సినిమాపై ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఆసక్తి రెట్టింపవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

#ఎన్టీఆర్30 సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'RRR' చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగులో పాల్గొంటారని, 2022 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS