ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి తనయుడు రాజా చెంబోలు నిశ్చితార్థం హిమబిందు తో జరిగింది. కోవిడ్ నిబంధనల కారణంగా అమ్మాయి, అబ్బాయి తరఫున అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని సింపుల్ గా నిర్వహించారు. నిశ్చితార్థం విషయాన్ని రాజా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలపడం విశేషం.
నిశ్చితార్థం వేడుక కు సంబంధించిన కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి ఈ కొత్త ప్రయాణం పట్ల ఆసక్తిగా ఉన్నానని వెల్లడించారు. ఇది 2020 లో బెస్ట్ పార్ట్ అని తెలిపారు. ఈ ఫోటోలలో రాజా హిమబిందు ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఈ జంట వివాహం అక్టోబరు మాసంలో జరిపేందుకు పెద్దలు నిశ్చయించారట.
రాజా చెంబోలు నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. రాజా 'అజ్ఞాతవాసి', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'హ్యాపీ వెడ్డింగ్', 'Mr. మజ్ను', 'అంతరిక్షం', 'రణరంగం' లాంటి పలు తెలుగు సినిమాల్లో నటించారు. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే ఆహా యాప్ లో రిలీజ్ అయిన 'భానుమతి & రామకృష్ణ' చిత్రంలో కూడా ఒక కీలక పాత్ర పోషించారు.