ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సంచలనాలు సృష్టించిన సినిమా 'బాహుబలి'. ఇండియన్ సినిమా గొప్పతనాన్ని దేశ దేశాల చాటి చెప్పిన తొలి చిత్రమిది. వారం రోజులకే సినిమా భవితవ్యం ఇది అని తేల్చేస్తున్నారు ప్రేక్షకులు. దాంతో వారం తిరిగే సరికి ఆ సినిమా ధియేటర్లో ఉండట్లేదు. అలాంటి తరుణంలో 'బాహుబలి' సినిమా సృష్టించిన సరికొత్త రికార్డు వింటే ఎవరైనా షాక్ తినాలి. అలాగే గర్వ పడాలి. 1050 ధియేటర్లలో 'బాహుబలి' సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ లెక్క ఒక్క ఇండియాలోనే కాదు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సాధించిన విజయం ఇది. ఈ రికార్డు అసలు సిసలైన రికార్డు. కాగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి' సినిమా సాధించిన వసూళ్లు 1700 కోట్లు. దేశంలో 1366 కోట్లు వసూళ్లు సాధించింది. భారత దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి సినిమా 'బాహుబలి'గా రికార్డులకెక్కింది. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుండీ బ్రేక్ లేకుండా ఈ సినిమా ధియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రబాస్, రానా, అనుష్క, తమన్నా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.