ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి', 'దంగల్' చిత్రాలు వసూళ్ల పరంగా రేస్‌లో ఏమాత్రం వెనక బడడం లేదు. గట్టి పోటీ ఇస్తున్నాయి ఈ రెండు సినిమాలు. ఈ రెండింటిలో ఎవరు ముందు 2000 కోట్లను టచ్ చేస్తారనేదే ప్రశ్న. రెండు సినిమాలకీ మధ్య తేడా ఆదివారం సాయంత్రానికి కేవలం 14 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇందులో ప్రస్తుతానికి 'దంగల్' సినిమా వెనకబడి ఉన్నప్పటికీ, రెండ్రోజుల్లోనే 'దంగల్', 'బాహుబలి ది కంక్లూజన్'ని దాటేయొచ్చునని అంచనా వేస్తున్నారు. చైనాలో ఈ సినిమాకి క్రేజ్ అస్సలు తగ్గడం లేదు. ఇప్పటికైతే 'బాహుబలి ది కంక్లూజన్' ముందుంది. చైనాలో ఇదే జోరు కొనసాగితే ఈజీగా 'బాహుబలి ది కన్ క్లూజన్' ఫిగర్‌ని 'దంగల్' దాటేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. 1000 కోట్ల క్లబ్‌లోకి 'బాహుబలి' ముందుగా దూసుకెళ్ళింది. ఆ తర్వాతే 'దంగల్' చేరింది. 1500 కోట్ల క్లబ్‌లోనూ 'బాహుబలి'దే ఫస్ట్ ప్లేస్. ఈ ఘనత సాధించిన రెండో సినిమా 'దంగల్'. 'దంగల్' దూకుడంతా చైనా వసూళ్ళతోనే. ఈ వసూళ్ళను 'దంగల్' టీమ్ కూడా భావించి ఉండదు. 650 కోట్ల రూపాయల వసూళ్ళని చైనాలో దాటేసింది 'దంగల్'. వెయ్యి కోట్లు దాటవచ్చునని సమాచారమ్. 'బాహుబలి' వెనకబడలేదుగానీ వేగం కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తోంది. దాంతో 2000 కోట్ల టార్గెట్‌ని ఏది అందుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.