ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- కేశవ

మరిన్ని వార్తలు

థియేటర్ల వద్ద ఇంకా బాహుబలి 2 మేనియా కొనసాగుతున్న వేళ, ఈ శుక్రవారం యంగ్ హీరో నిఖిల్ తన కొత్త చిత్రం కేశవ తో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

అయితే ఇప్పటికే కొత్త తరహా కథలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటాడు అనే ఒక పాజిటివ్ ట్యాగ్ నిఖిల్ కి ఉండడం కేశవ చిత్రానికి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. అయితే టీజర్ రిలీజ్ అయిన నాటి నుండి ఇది ఒక రివెంజ్ స్టొరీ అని చెప్పేయడంతో ఈ చిత్ర టేకింగ్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.

ఈ ఆసక్తిని ఒకరకంగా దర్శకుడు సుదీర్ వర్మ కొంతవరకు నిలుపుకున్నాడు అనే చెప్పాలి. అయితే ఇంకొంచెం బాగా తీస్తే బాగుండేది అని కూడా టాక్ కూడా వచ్చింది. కాని కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ చిత్రం మొదటి రోజు- రూ 4.60 కోట్లు కాగ రెండో రోజు రూ 3.70 కోట్లు ఆర్జించింది.

ఇక మూడో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. దీన్నిబట్టి నిఖిల్ కేశవ చిత్రాన్నికూడా తన హిట్ సినిమాల ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఈ వారం iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్ గా ఏకగ్రీవంగా కేశవ స్థానం దక్కించుకుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS