బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?
పార్ట్ 2 చూడాలన్న కోరికను డ్రైవ్ చేసే కీలకమైన ప్రశ్న ఇది. రెండేళ్లుగా దేశ వ్యాప్తంగా.. నానుతున్న అంశం కూడా ఇదే. బాహుబలి 2 జయాపజయాలు ఈ పాయింట్‌పైనే ఆధారపడి ఉన్నాయన్నది నిర్వివాద అంశం. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.... బాహుబలిని కట్టప్ప చంపలేదట. అసలు బాహుబలి చావలేదని, బతికే ఉన్నాడని, రెండో భాగంలో బాహుబలి కనిపించడం ఖాయమని ఇప్పటికే ఈసినిమా చూసేసిన వాళ్లు చెబుతున్నారు. కేవలం బిజ్జాలదేవ చెప్పుడు మాటలు విని, తన కొడుడికి ఎక్కడ రాజ్యాధికారం దక్కకుండా పోతుందో అని, శివగామినే బాహుబలిని చంపించాలనుకొంటుందని, అందుకోసం కట్టప్పని బెదిరించి పావుగా వాడుకొంటుందని, మహారాణి ఆజ్ఞని కట్టప్ప పాటించినా... బాహుబలి పై ఉన్న ప్రేమతో బతికించుకొంటాడని తెలుస్తోంది. నిజానికి ఈ పాయింట్‌ని దాదాపుగా సినీ అభిమానులంతా ఊహించిందే. దానికంటే భిన్నంగా కొత్తగా ఏదో చూపిస్తాడని సినీ అభిమానులు ఆకాంక్షించారు.కానీ.. తీరా చూస్తే రాజమౌళి రొటీన్ గానే కథ నడిపించేశాడేమో అనిపిస్తోంది. అసలు కథ ఏంటన్నది తేలాలంటే ఇంకొద్ది గంటలు ఆగితే చాలు.