బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లో చరిత్ర సృష్టించింది. ఈసినిమా దాదాపుగా రూ.500 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కలిపి రూ.130 కోట్ల బిజినెస్ చేసిందట. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, శాటిలైట్ కలుపుకొని దాదాపుగా మరో రూ.350 కోట్ల వరకూ ఉంటుందని ఓ అంచనా. ఈ స్థాయిలో ఓ తెలుగు సినిమా బిజినెస్ జరుపుకోవడం చరిత్రే! ఓవరాల్గా బాహుబలి 2 రూ.1000 కోట్ల వరకూ సాధిస్తుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలిరోజే రూ.100 కోట్లు సాధించే సత్తా బాహుబలి 2కి ఉందని ట్రేడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. ఈ లెక్కలన్నీ నిజమైతే బాహుబలి 2 ఆల్ టైం ఇండియన్ రికార్డ్ బద్దలు కొట్టినట్టే.