రికార్డులకు కేంద్రబిందువైన 'బాహుబలి' సినిమా తాజా రికార్డును నమోదు చేయబోతోంది. ఈ సినిమాను ఏకంగా 6500 ధియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇదో సరికొత్త రికార్డుగా చెప్పవచ్చు. ఇంతవరకూ ఏ ఇండియన్ మూవీని ఇన్ని ధియేటర్స్‌లో రిలీజ్ చేయలేదు. ఇదే తొలిసారి కావడం విశేషం. యూ ట్యూబ్‌లో ఆల్రెడీ హిట్స్ రికార్డు స్థాయిలో సంపాదించేసింది ఈ సినిమా. ఇక ఈ తాజా రికార్డుతో ట్రేడ్ పండితులు లెక్కలు కూడా పక్కాగా వేసేస్తున్నారు. ఈ సినిమాకి తొలి రోజు ఓపెనింగ్సే ఇంతవరకూ ఏ సినిమాకీ రానంత స్థాయిలో వచ్చేస్తాయంటున్నారు. ఇదో రికార్డు ఈ సినిమాకి ఫిక్స్ అయిపోయింది. చిత్ర యూనిట్ ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. హీరో, హీరోయిన్లు, డైరెక్టర్సే కాకుండా, టెక్నీషియన్స్‌లో ప్రతీ చిన్న టెక్నీషియన్ కూడా ఈ సినిమా కోసం ఎంతో పాటు పడ్డారు. ఆ శ్రమకు ఫలితం మరి కొన్ని రోజుల్లోనే దక్కబోతోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో, పలు దేశాల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. తెలుగు సినీ చరిత్రలోనే 'బాహుబలి'ది ఓ గొప్ప చరిత్రగా చెప్పవచ్చు. మొదటి పార్ట్‌లో కేవలం పాత్రల పరిచయాలే జరిగాయి. అసలు సినిమా అంతా ఈ పార్ట్‌లోనే ఉందంటూ అందరిలోనూ ఇంట్రెస్ట్ శిఖరాగ్ర స్థాయిలో ఉంది. ఇన్ని అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.