యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం- జై లవ కుశ షూటింగ్ మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది.
అయితే ఒక ఆసక్తికర విషయం ఈ షూటింగ్ లో జరిగింది. అదేమిటంటే, నందమూరి హరికృష్ణ షూటింగ్ లో తళుక్కుమని మెరవడమే. ఎన్టీఆర్ అలాగే హరికృష్ణ ఉన్న పిక్చర్ ఒకటి ప్రముఖ నటుడు వెన్నెల కిశోరే ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడంతో నందమూరి అభిమానులకి స్వీట్ ట్వీట్ ఇచ్చినట్టు అయింది.
మరి హరికృష్ణ షూటింగ్ చూడడానికి వచ్చారా లేక ఈ చిత్రంలో ఏదైనా గెస్ట్ పాత్ర చేశారా అన్నది ఈ సినిమా రిలీజ్ అయితే కాని తెలియదు.