తెలుగు సినిమా ఖ్యాతిని దేశ దేశాల చాటి చెప్పిన సినిమా 'బాహుబలి'. ఈ సినిమాకి ఎన్ని అవార్డులొచ్చినా తక్కువే అవుతాయి. అలాంటిది ఇప్పటికే ఎన్నో అవార్డులు, రికార్డులు సంపాదించి పెట్టిన ఈ సినిమాకి తాజాగా జాతీయ చలన చిత్ర అవార్డుల కమిటీ రెండు ముఖ్యమైన అవార్డుల్ని ప్రకటించింది. ఉత్తమ యాక్షన్ చిత్రంగా 'బాహుబలి'కి అవార్డు ప్రకటించింది. దాంతో పాటు, ఉత్తమ ఎఫెక్ట్స్ కేటగిరిలో కూడా 'బాహుబలి' సినిమా అవార్డు దక్కించుకుంది. తెలుగులోనే కాదు, హిందీలో కూడా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.
బాలీవుడ్‌లో ఓ తెలుగు డబ్బింగ్ చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు సాధించింది లేదింతవరకూ. అందుకే 'బాహుబలి' ది స్పెషల్. ఈ సినిమాని జక్కన్న రాజమౌళి అంత చక్కగా తీర్చి దిద్దారు. దేశం కాని దేశం చైనాలో కూడా 'బాహుబలి' రికార్డులు సృష్టించింది. అందుకే అవార్డులన్నీ 'బాహుబలి'కే సొంతం. యాక్షన్ చిత్రాలను ఎంతగానో ఇష్టపడే రాజమౌళి కెరీర్‌లో 'బాహుబలి' చిత్రం ఓ కీలక ఘట్టం. దర్శకుడిగా ఆయన స్థాయి ఆకాశానికందుకుంది 'బాహుబలి' చిత్రంతో. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రబాస్ యూనివర్సల్ స్టార్ అయిపోయాడు.
'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి ది కన్‌క్లూజన'్ అనే రెండు భాగాలుగా విడుదలైంది. ఐదేళ్లు 'బాహుబలి' మేనియాలో ఉండిపోయారు ప్రేక్షకులు. గతేడాది 'బాహుబలి ది కన్‌క్లూజన్'తో బాహుబలి పీరియడ్ కంప్లీట్ అయ్యింది కానీ, ఆ సినిమా తాలూకు ఎఫెక్ట్ అలాగే ఉండిపోయింది. దటీజ్ 'బాహుబలి'.