టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరిపై ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డి ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయ్యి కూర్చుంది. ఈమె ఆందోళన విషయంలో జాతీయ మానవ హక్కుల కమిటీ కలగచేసుకోవడంతో, ఇష్యూ ముదిరి పాకాన పడింది. తద్వారా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శ్రీ రెడ్డిపై విధించిన బ్యాన్‌ని ఎత్తివేయడంతో, కథ సుఖాంతం కాలేదు. ఆమె అనుకున్నది ఇంకా సాధించలేదంటోంది. ఆమె అనుకున్న టార్గెట్‌ని రీచ్ అయ్యే దాకా ఈ పోరాటం ఆగదంటోంది. కాస్టింగ్ కౌచ్ అనేది సినీ పరిశ్రమ ఉద్భవించినప్పటి నుండీ వుంది.
కానీ ఈ వందేళ్లలో ఈ విషయంపై ఎవ్వరూ ఈ విధంగా ఆందోళన చేపట్టింది లేదు అని సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా స్పందించారు.' దేశం కోసం వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ ఎలాగైతే కత్తి పట్టి పోరాడి యుద్దం చేసిందో. అలాగే శ్రీ ఝాన్సీభాయ్ తన దేహాన్ని పణంగా పెట్టి పోరాడింది..' ఆమె చేస్తున్న ఈ పోరాటానికి హ్యాట్సాఫ్ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. అయితే అర్ధనగ్న ప్రదర్శన చేయడం తప్పే కానీ, అలా చేస్తే కానీ జాతీయ, అంతర్జాతీయ సంఘాలు రంగంలోకి దిగలేదు.
ఏది ఏమైనా శ్రీరెడ్డి చేపట్టిన ఆందోళనను మెచ్చుకొని తీరాల్సిందేనని వర్మ శ్రీరెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటోన్న మహిళల కోసం 'మా' అసోసియేషన్ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సినీ ఇండస్ట్రీలోని సీనియర్ నటులు, దర్శకులు, నిర్మాతలు సభ్యులుగా ఉంటారని మా పేర్కొంది.