దేశ వ్యాప్తంగా థియేటర్లు తెరచుకుంటున్నాయి. సినీ ప్రియులకు, నిర్మాతలకూ, థియేటర్ యాజమాన్యానికి ఇది శుభవార్తే. కానీ.. సినిమాలేవీ? కొత్త సినిమాలువిడుదల చేయడానికి నిర్మాతలకు సముఖంగా లేరు. దాంతో.. సినిమాలు లేకపోవడంతో, థియేటర్లు తెరచుకున్నా లాభం లేకుండా పోయింది. దాంతో పాత సినిమాలే దిక్కయ్యాయి. ఎప్పుడో విడుదలైన బాహుబలి - బిగినింగ్, బాహుబలి - కన్‌క్లూజన్‌ని మళ్లీ విడుదల చేయాలని నిర్మాత కరణ్ జోహార్ ఫిక్సయ్యారు.
ఈ రెండు సినిమాల హిందీ రైట్స్ ఆయన దగ్గరే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కొన్ని ముఖ్య పట్టణాలలో, ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని కరణ్ జోహార్ భావిస్తున్నారు. శుక్రవారం `బాహుబలి 1` విడుదలవుతుంటే, ఈనెల 13న `బాహుబలి 2` విడుదల కానుంది. మరి ఈ రీ రీలీజ్‌లోనూ బాహుబలి సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.