బాహుబలి చిత్రంతో ప్రేక్షకులని కనువిందు చేసిన రాజమౌళి & కో ఇప్పుడు పిల్లలకి పాఠాలు చెప్పబోతున్నారు.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో జరుగుతున్న యాక్సిడెంట్స్ కి మైనర్స్ ఎక్కువగా కారణమవుతున్నారు అని ఒక సర్వేలో తేల్చారు. దీనిని అరికట్టడానికి వారు దర్శకుడు రాజమౌళిని కలిశారట.
జూలై రెండవ వారం నుండి హైదరాబాద్ లోని కొన్ని ఎంపిక చేసిన స్కూల్స్, కాలేజీల్లో బాహుబలి యూనిట్ ట్రాఫిక్ గురించిన స్పెషల్ క్లాసులు తీసుకోనున్నారు అని తెలుస్తుంది.
మొత్తానికి రాజమౌళి తన బాహుబలి టీం తో కలిసి ట్రాఫిక్ పైన అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు అన్నమాట.