అందరు బాహుబలి పార్ట్ 2 రిలీజ్ కోసం ఎదురు చూస్తుంటే, మీరేంటి బాహుబలి పార్ట్ 1 అంటున్నారు అని అనుకోకండి.
అందుతున్న సమాచారం ప్రకారం, బాహుబలి పార్ట్ 2 రిలీజ్ కి వారం ముందుగా మొదటి భాగం రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టు బాహుబలి టీం అభిప్రాయపడింది. దీనికి కారణం, మొదటి పార్ట్ కి ఇది కొనసాగింపు కావడం అలాగే మొదటి భాగం ఎవరైనా చూడకపోయి ఉంటే వాళ్ళకోసం రీ-రిలీజ్ చేయాలనుకుంటున్నారట!
ఇంకేముంది వచ్చే నెలలో బాహుబలి రెండు భాగాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.