ప్రభాస్ కొత్త లుక్‌తో దర్శనమిస్తున్నాడు. 'బాహుబలి' సినిమా కోసం గడ్డంతో, బాగా పెరిగిన జుట్టుతో ఇన్నాళ్ళూ కనిపించిన ప్రభాస్ తన కొత్త సినిమా కోసం కొత్త లుక్‌లోకి మారిపోయాడు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసమే ప్రభాస్ గెటప్ ఛేంజ్ చేసేశాడు. లవర్ బోయ్‌లా మళ్లీ ఇదివరకటిలా అమ్మాయిల మదిలో చోటు సంపాదించేసుకోనున్నాడు ప్రబాస్ లుక్‌తో. అంతేకాదు ఈ లుక్‌లో ప్రభాస్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. మేచో లుక్‌తో, యూత్‌ఫుల్ టచ్‌తో ప్రభాస్‌ని చూసి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోవడం గ్యారంటీ. 'బాహుబలి ది కంక్లూజన్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఈ కొత్త లుక్‌తో అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. అంతే కాదు 'బాహుబలి' సినిమా కోసం విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ చలాకీగా సమాధానాలిచ్చాడు. చాలా ముచ్చటపడిపోతున్నారు ప్రబాస్‌ని ఇలా చూసి ఆయన అభిమానులు. 'బాహుబలి' కారణంగా ఇప్పుడు దేశమంతా ప్రభాస్ గురించి చర్చించుకుంటోంది. నేషనల్ మీడియాతో పాటు, బాలీవుడ్ మీడియా కూడా 'బాహుబలి' ట్రైలర్‌ని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. ఆ సినిమా కోసం ప్రభాస్ పడ్డ కష్టం అలాంటిది. అందుకు తగ్గట్లే ప్రబాస్‌కి దక్కిన గుర్తింపు ఆహ్వానించదగ్గదే.