కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అన్న విషయం ప్రపంచానికి తెలియడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది.
అయితే అసలు కట్టప్ప పాత్ర కోసం సత్యరాజ్ ని కలవడానికి రాజమౌళి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు అని స్వయంగా జక్కన్నే చెప్పాడు. చెన్నైలో సత్యరాజ్ ని కలిసే సమయంలో రాజమౌళి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడట! దీనికి కారణం ప్రభాస్ పాత్ర సత్యరాజ్ పాత్ర పై కాలు పెట్టె సన్నివేశం ఉండడమే.
అయితే ఆ సన్నివేశం చెప్పగానే, సత్యరాజ్ ఒకసారిగా- "ఆహా.... అదిరింది గా" సీన్ అని ఒక్కసారిగా ప్రభాస్ ని రాజమౌళిని గట్టిగా కౌగిలించుకున్నాడు. అయితే ప్రభాస్ తో మిర్చి సినిమాలో అప్పటికే నటించిన అనుభవం ఉండడం కూడా ఈ పాత్ర ఆయన ఒప్పుకోవడానికి దోహదపడింది అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
దీనికి ముందే నాజర్ ని కలిసి బిజ్జలదేవ పాత్ర చెప్పి ఇలా సత్యరాజ్ గారికి కథ చెప్పడానికి భయం అవుతుంది అని అన్నప్పుడు. “ పర్లేదు.. సత్యరాజ్ ఒప్పుకుంటాడు నువ్వేం కంగారుపడకు అని ధైర్యం కూడా చెప్పాడట”
ఏదైతే ఏమి చివరికి అందరు ఒప్పుకున్నారు మనముందుకి ఒక గొప్ప చిత్రాన్ని తెస్తున్నారు.