హౌస్‌లో ఎలాంటి మైనస్‌లు లేని కంటెస్టెంట్ అంటే బాబా భాస్కర్. డే వన్ నుండీ ఆయన హౌస్‌కి బెస్ట్ ఎంటర్‌టైనర్. బెస్ట్ కుక్కర్. ప్రతీ రోజూ హౌస్‌లోని మెంబర్స్ అందరికీ ఆయనే స్వయంగా వండి వడ్డించేవారు. ఏ టైమ్‌లోనూ ఆయన విచక్షణ కోల్పోలేదు. ప్రతీ టాస్క్‌కీ 100 పర్సెంట్ ఇచ్చాడు. వయసుకు మించి పర్‌ఫామ్ చేశాడు. ఇంటికి ఓ పెద్ద దిక్కులా ఉన్నారు. అందరితోనూ ఆయనకి స్నేహమే ఉంది. కానీ, విరోధం లేదు. వెతికి చూసినా మైనస్‌లు కనిపించని వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ బాబా. ఇది పక్కా. హౌస్‌మేట్స్‌తో పాటు, ఆడియన్స్‌లోనూ ఇదే అభిప్రాయం ఉంది.
ఇదే విషయాన్ని వరుణ్ సందేశ్ చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన ఎమోషనల్ అవ్వడం ఆడియన్స్ మనసు చివుక్కుమనేలా చేసింది. ఆయన ఎమోషన్‌ని తప్పు పడుతున్నారని గ్రహించిన బాబా భాస్కర్ ఆ తర్వాత ఎంత బాధ ఉన్నా మనసులోనే దాచేసుకున్నారు. బయట పడడానికి ఇష్టపడలేదు. అక్కడ కూడా ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశారాయన. మిగిలిన కంటెస్టెంట్స్‌తో పోల్చితే, అస్సలేమాత్రం హోప్స్ లేకుండా వచ్చినోడు.
రెండు మూడు వారాలకే ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు. ఆయన కూడా అదే అభిప్రాయంతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపారు కూడా. కానీ, అనూహ్యమైన అభిమానంతో హౌస్‌లో టాప్ 5 వరకూ కొనసాగారు. ఒక్క మాటలో చెప్పాలంటే, బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచేందుకు అన్ని రకాల అర్హతలున్న వ్యక్తి వన్ అండ్ ఓన్లీ బాబా భాస్కర్ మాత్రమే, నో డౌట్ ఎట్ ఆల్.