బిగ్‌బాస్‌లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన అలీ రెజాని నాగార్జున తీవ్రంగా మందలించారు. దొంగా - పోలీస్ టాస్క్ విషయమై అలీ రెజా - హిమజ మధ్య జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిందే. ఈ ఇష్యూలో అక్కడ జరిగిందొకటి, చూపించిందొకటి. ఇది మాత్రం పక్కా. చూపించినంత వరకూ, రెండు వైపులా ఆలోచిస్తే, అలీనీ పెద్దగా తప్పు పట్టడానికి ఏమీ లేదు.
అలా అని హిమజని కూడా తప్పు పట్టలేం ఈక్వెల్‌గా ఆలోచించే వీక్షకుడి దృష్టి కోణంలో ఇష్యూ జరిగాక వీరిద్దరి మధ్యా ఓ అండర్‌స్టాండింగ్ జరగడం, ఇరువురూ క్షమాపణలు చెప్పుకోవడం ద్వారా ఇష్యూని సెటిల్ చేసుకోవడం జరిగిపోయాయ్. కానీ, వీకెండ్‌లో నాగార్జున ఈ ఇష్యూని మళ్లీ కెలికి పెద్దది చేసినట్లుగా అనిపించింది. అందరి ముందూ అలీని గుంజీలు తీయించడం, కాస్త ఎక్కువగా ఫైర్ అయినట్లు కనిపించడం ఇదంతా అలీ రెజా అభిమానుల్లో తీవ్రంగా నాటుకుపోయింది. ఈ విషయంలో నాగార్జున అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని వారు భావిస్తున్నారు. మొదట్లో అలీని 'అలీ భాయ్' అని సంబోధించిన నాగ్‌ని 'నన్ను అలా పిలవొద్దు సార్ ప్లీజ్.. జస్ట్ అలీ అని కాల్ మీ..' అన్నాడు.
ఒకవేళ అది మనసులో పెట్టుకుని నాగార్జు సమయం వచ్చింది కదా, అని హిమజ ఇష్యూలో అలీపై ఇంతగా రియాక్ట్ అయ్యాడా.? డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటే చాలదు, అమ్మాయిల పట్ల ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోవాలి.. అంటూ అలీకి నాగ్ పీకిన క్లాస్‌తో సోషల్ మీడియాలో నాగ్ పట్ల వ్యతిరేకత ఎక్కువైంది. సెన్సిటివ్‌గా డీల్ చేయాల్సిన ఇష్యూని స్కూల్ టీచర్‌లా కఠినంగా డీల్ చేశాడనీ, ఆలీ అహంపై కొట్టాడంటూ నాగ్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.