బిగ్‌బాస్‌లో వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతవరకూ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది బిగ్‌బాస్ అనే ఒపీనియన్ క్రియేట్ చేసిన బాబా భాస్కర్ మాస్క్ తీసేశాడు. సీరియస్‌గా గేమ్ స్ట్రాటజీని ఫాలో చేస్తున్నాడు. టాస్క్‌ల్లో చాలా ఎగ్రెసివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. విజయం సాధిస్తున్నాడు కూడా. లేటెస్ట్‌గా మూడు భాగాలుగా జరిగిన 'బ్యాటిల్ ఆఫ్ ది బెటాలియన్' టాస్క్‌లో బాబా భాస్కర్ మంచి పర్‌ఫామెన్స్ ఇచ్చి ఫైనల్ లెవల్‌కి చేరుకన్నారు.
నిజానికి చెప్పాలంటే ఇంతవరకూ జరిగిన టాస్క్‌ల్లో ఇదొక్కటే ఓ మోస్తరు క్రిటికల్ టాస్క్‌గా భావించాలి. బిగ్‌బాస్ సూచించిన ఓ ఫ్రేమ్‌లో తలపై ఓ వస్తువును పెట్టుకుని, కదలకుండా కొన్ని గంటల పాటు నిలుచోవడంలో బాబా భాస్కర్ మంచి ప్రతిభ చూపించారు. అలా ఫైనల్ లెవల్‌కి చేరుకున్నారు. ఇదిలా ఉంటే, మంచోడు.. మంచోడు, కల్మషం లేనోడు.. అనే ట్యాగ్ నుండి బాబా భాస్కర్ కాదు, బాబా మాస్కర్ అనే నేమ్ తెచ్చుకుంటున్నాడు బాబా భాస్కర్. కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడనీ, చాలా మారిపోయాడనీ హౌస్ మేట్స్ భావిస్తున్నారు. హీరోయిజం చూపిస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఇవన్నీ హౌస్ మేట్స్ నుండి తలెత్తుతున్న అభిప్రాయాలే కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాబా భాస్కర్ కమిట్మ్‌ంట్‌తో బిగ్‌బాస్ కిరీటం ఒకవేళ ఆయనకే దక్కేస్తుందా.? అనే అనుమానం కూడా కలిగేస్తోంది. ఎలిమినేషన్ రౌండ్‌లో పలానా వ్యక్తి ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది కానీ, ఎప్పటికప్పుడే హౌస్‌లో ఈక్వేషన్స్ మారిపోతున్న దర్మిలా బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ ఎవరవుతారనే అంశంపై ఆడియన్స్ అంచనా వేయలేకపోతున్నారు. అటు తిరిగి, ఇటు తిరిగి బిగ్‌బాస్ కిరీటం బాబా భాస్కర్ తన్నుకెళ్లిపోతాడా.? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.