అసలు గేమ్‌ ఇప్పుడే స్టార్ట్‌ అయ్యిందన్న బాబా భాస్కర్‌.

మరిన్ని వార్తలు

బిగ్‌హౌస్‌కి 'గుడ్‌ మ్యాన్‌' అనే ట్యాగ్‌.. కాదు కాదు 'ముసుగు' వేసుకున్నాడు ఇంతవరకూ బాబా భాస్కర్‌. ఇక నుండి ఆ ముసుగు తీసేయబోతున్నానని ఆయనే స్వయంగా చెప్పారు. ఇంతవరకూ అసలు తాను ఆడింది గేమే కాదట. ఇక నుండీ అసలు సిసలు గేమ్‌ చూస్తారంటున్నాడు బాబా భాస్కర్‌. అంటే, బాబా ఇక నుండీ హౌస్‌లో కొత్త స్ట్రాటజీని ఫాలో చేయబోతున్నాడా? అంటే అవుననే అనుకోవాలి.

 

మరి బాబా ప్లే చేయబోయే ఆ కొత్త స్ట్రాటజీ ఏంటో తెలియాలంటే, ఈ వారం మిస్‌ కాకుండా బిగ్‌బాస్‌ చూడాల్సిందే. మొదటి రెండు వారాలు మంచి మనిషి అనిపించుకున్న బాబా భాస్కర్‌పై మూడో వారంలో కొన్ని మరకల చురకలు అంటేలా కనిపించాయి. కానీ, నాలుగోవారానికి వచ్చేసరికి అవన్నీ మాసిపోయాయి. బాబా భాస్కర్‌ మళ్లీ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అయిపోయాడు.

 

ఎలిమినేషన్‌లో హౌస్‌ నుండి బయటికి వచ్చిన రోహిణి, ఆయనకు 100 కి 1000 మార్కులిచ్చేసి, 'ఈ అబ్బాయి చాలా మంచోడు' అంటూ బెస్ట్‌ స్టాంప్‌ వేసేసింది. ఇంటి పెద్దగా బిగ్‌ ఎంటర్‌టైనర్‌గా బాబా భాస్కర్‌ ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు ఇటు హౌస్‌ మేట్స్‌ నుండీ, ఇటు వీక్షకుల నుండీ. మరి ఈ అభిమానం ఇలాగే ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS