సుజిత్‌కి డార్లింగ్‌ 'సాహో' అనేశాడు

మరిన్ని వార్తలు

'రన్‌ రాజా రన్‌' సినిమా టైంకి సుజిత్‌ చాలా చిన్నోడు. జస్ట్‌ 22, 23 ఇయర్స్‌ మాత్రమే. ఆ టైంలోనే 'సాహో' స్టోరీని నలభయ్యేళ్ల అనుభవం ఉన్న వ్యక్తిలా చెప్పాడనీ, తను కథ చెప్పిన విధానం నచ్చి వెంటనే ఓకే చేశాననీ చెప్పాడు డార్లింగ్‌ ప్రబాస్‌. అప్పుడు చిన్నగా స్టార్ట్‌ అయిన 'సాహో' కథ అలా అలా ఇంత పెద్దదైపోయింది. అంత చిన్నోడు, బాలీవుడ్‌, హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ని చాలా బాగా డీల్‌ చేశాడు.

 

టోటల్‌ క్రెడిట్‌ సుజిత్‌కే.. అంటూ డైరెక్టర్‌ సుజిత్‌ని ఆకాశానికెత్తేశాడు. లేటెస్ట్‌గా 'సాహో' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైద్రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జక్కన్న రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. ప్రబాస్‌ తన ప్రసంగంలో భాగంగా, డైరెక్టర్‌ గురించి పై విధంగా వ్యాఖ్యానించాడు. నో డౌట్‌ సుజిత్‌ ఇన్‌ ఫ్యూచర్‌ గ్రేట్‌ డైరెక్టర్‌ అవుతాడని ప్రబాస్‌ చెప్పాడు. ప్రబాస్‌ ప్రసంగిస్తున్నప్పుడు మధ్యలో ఫ్యాన్స్‌ ఈలలు, కేకలతో కోలాహలం చేశారు.

 

తన ప్రసంగం మధ్యలోనే లవ్‌ యూ డార్లింగ్స్‌.. లవ్‌ యూ డార్లింగ్స్‌.. అంటూ ఫ్యాన్స్‌ని సముదాయించాడు ప్రబాస్‌. ఈ నెల 30న 'సాహో' ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్‌ వైడ్‌గా భారీ ఎత్తున 'సాహో' విడుదలవుతోంది. ఈ క్రమంలో పలు చోట్ల ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌ ప్లాన్‌ చేశారు. వరుస ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు ప్రబాస్‌ అండ్‌ టీమ్‌ కసరత్తులు చేస్తోంది. శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటించిన 'సాహో' యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS