అదే ట్రాక్‌ ఫాలో అవుతోన్న శేఖర్‌ మ్ముల!

మరిన్ని వార్తలు

శేఖర్‌ కమ్ముల సినిమాల్లో ఎక్కువగా తెలంగాణా నేటివిటీకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆయన గత చిత్రం 'ఫిదా'లో మలర్‌ బ్యూటీ సాయిపల్లవితో పక్కా తెలంగాణా పలుకులు పలికించి, సక్సెస్‌ అయ్యారు. ఈ సారి కూడా ఆయన తన సినిమాలో సాయి పల్లవినే హీరోయిన్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే హీరో మాత్రం ఛేంజ్‌ అయ్యాడు. అక్కినేని బుల్లోడు నాగచైతన్యతో శేఖర్‌ మ్ముల ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాలో ఈ సారి హీరోతో తెలంగాణా పలుకులు పలికించబోతున్నాడట. అందుకోసం స్పెషల్‌గా చైతూ తెలంగాణా యాసను ట్రైన్‌ అవుతున్నాడట. ప్రస్తుతం చైతూ 'వెంకీ మామ' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ నెలాఖరు నుండి శేఖర్‌ కమ్ముల సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది. ఈ లోగానే తెలంగాణా యాసపై గట్టి పట్టు సాధించబోతున్నాడట చైతూ.

 

ఇదో క్యూట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అనీ తెలుస్తోంది. అయితే, సాయి పల్లవి కూడా తెలంగాణా యాసలోనే మాట్లాడుతుందా? లేక కేవలం హీరో ఒక్కడికే ఈ సినిమాలో ఈ వెసులుబాటు ఇచ్చాడా దర్శకుడు అనేది వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS