బిగ్‌బాస్ ఫ్యామిలీ ఎంట్రీలో భాగంగా, బాబా భాస్కర్ ఫ్యామిలీ ఫ్యామిలీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కొడుకు, కూతురు మొదట హౌస్‌లోకి వచ్చారు. అప్పుడు ఫ్రీజింగ్లో ఉన్నాడు బాబా భాస్కర్. తండ్రిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు బాబా భాస్కర్ కొడుకు, కూతురు. కొంతసేపటికి ఫ్రీజింగ్ మూడ్ నుండి రిలీజ్ చేశాడు బిగ్‌బాస్. ఆ తర్వాత పిల్లలతో ముచ్చటిస్తుండగా, కాసేపటికి ఆయన భార్యను కూడా లోపలికి పంపించారు. తమిళనాడు నుండి వచ్చినా, ఆయన భార్య రేవతి తెలుగులో చక్కగా సంభాషించారు.
హౌస్ మేట్స్ అందరి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. టైటిల్ గెలిచి రావాలని భర్తకు సూచించారు. రెండో వారమే ఇంటికి తిరిగొస్తానని చెప్పిన బాబా ఇన్ని రోజులు హౌస్‌లో ఉండడం నిజంగా ఆశ్చర్యకరమనీ రేవతి అన్నారు. ఇక హౌస్‌లోకి పంపేటప్పుడు కూతురుకీ, భార్యకీ ఫుల్‌గా మేకప్ వేశారు బిగ్‌బాస్ టీమ్. నాకు మేకప్ నచ్చదని తెలుసు కదా.. ఎందుకు ఇంత మేకప్ వేసుకున్నావ్.. అని బాబా భార్యని ప్రశ్నించారు. చెప్పినా వారు వేసేశారు.. అని రేవతి చెప్పడం, పదే పదే మేకప్, మేకప్ అంటూ కూతుర్నీ, భార్యనీ బాబా అడగడం ఫన్నీగా అనిపించింది.
ఏడవద్దు, ఏడిస్తే బాగుండరు అని రేవతి, బాబాకి సూచించింది. బాగా ఆడుతున్నారు. అలాగే ఆడండి.. అని చెప్పింది. చివరిగా ఇంటిని విడిచి వెళ్లాల్సిన టైం వచ్చేటప్పటికి హౌస్మేట్స్ మళ్లీ ఫ్రీజ్ మూడ్‌లోకి వెళ్లాలని బిగ్‌బాస్ సూచించడం, లాస్ట్ మినిట్‌లో రిలీజ్ చేయగా, డోర్ వరకూ కాదు కాదు, డోర్ లోపలి వరకూ వెళ్లిపోయి, హౌస్‌మేట్స్‌ని సాగనంపడం.. అంతా చాలా చాలా ఫన్నీగా అనిపించింది.