ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు అయిన బాబా సెహగల్ గురించి తెలియని వారుండరు. ఎన్నో పాపులర్ సాంగ్స్ ఆయన గాత్రంలో నృత్యం చేశాయి. ప్రస్తుతం కరోనాతో ప్రపంచం కలవరంలో మునిగిన వేళ ఈ అంశంపై ఆయన ఓ పాటను రూపొందించారు. తన పాట ద్వారా, కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కరోనాపై చాలా మందిలో చాలా రకాల భయాలున్నాయి. ఆ భయాలను వీడండి.. చేయి చేయి జోడించి ‘అంటే ఎవరి చేయి వారే) నమస్కారం చేయడం ద్వారా కరోనాని కట్టడి చేయండి.. అంటూ ఆయన ఓ ప్రత్యేక పాట ద్వారా తెలిపారు. ఈ పాట ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
ఇదేం గోల్రా బాబూ కరోనాతో ప్రపంచ దేశాలు గడగడలాడిపోతుంటే, ఒకరు బ్లీచింగ్ పౌడర్, పారాసిట్మాల్‌తో కరోనా కట్టడి అంటారు. మరొకరు నమస్కారంతో కట్టడి అంటారూ.. అని నెటిజన్లు వాపోతున్నారనుకోండి. అత్యంత డేంజర్ ఇష్యూని, నిజంగానే భయపడాల్సిన ఈ ఇష్యూని కొందరు రకరకాలుగా డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. అది వేరే విషయం అనుకోండి. కానీ, బాబా సెహగల్ రూపొందించిన పాటలో జాగ్రత్తలు కూడా ఉన్నాయిలెండి. ఆ పాట డౌన్‌లోడ్ చేసుకుని వింటే, ఆయన ఏం చెప్పారనేది తెలుసుకోవచ్చు. అది వేరే విషయం. ఏది ఏమైనా, అన్ని రకాల వ్యవస్థల్నీ నిర్వీర్యం చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనాని అంత లైట్ తీసుకోవడానికైతే లేదు. వ్యక్తిగత పరిశుభ్రతను పాఠిస్తూ, సోషల్ డిస్టెన్స్‌ని అనుసరించడం దేశ పౌరునిగా ప్రతీ ఒక్కరి బాధ్యత. ఈ సోషల్ బాధ్యత గురించి ఎవ్వరు చెప్పినా వినాల్సిందే. ఎవరికి వారు పాఠించాల్సిందే.