బాబు బాగా బిజీ ట్రైలర్ కొద్ది నిమిషాల ముందే విడుదలయింది. అయితే సినిమా యూనిట్ విడుదల చేసిన టీజర్ లోనే ఆడియన్స్ కి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే హింట్ ఇచ్చేశారు. దానితో ఈ సినిమా ట్రైలర్ కోసం బాగానే వెయిట్ చేశారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే, హీరో పాత్ర సెక్స్ అడిక్ట్ అవ్వడంతో, ట్రైలర్ మొత్తం కూడా వేరువేరు ఆడవాళ్ళతో అతను శృంగారం కోసం ప్రయత్నించే సీన్స్ మనకి కనిపిస్తాయి. అయితే హిందీలో వచ్చిన హంటర్ సినిమాతో పోలిస్తే ఇందులో కొంచెం హాట్ సీన్స్ తక్కువనే ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే ఇందులో హీరోయిన్స్ గా నటించిన- మిష్టీ, శ్రీముఖి, సుప్రియ, తేజస్వి ల గ్లామర్ ఈ చిత్రానికి బాగాప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక శ్రీనివాస్ అవసరాల గురించి చెప్పాలంటే- నిజంగా అతనిలోని యాక్టర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కథకి అనుగుణంగా తనని తాను మలుచుకున్న తీరు చాలా బాగుంది. కాకపోతే ఈ సినిమాకి ఏకైక అడ్డంకి ఉందంటే అది కేవలం- అడల్ట్ కంటెంట్ ట్యాగ్.
చూద్దాం.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపనుందో..