వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మాతలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్టర్. ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన 21 గంటల్లోనే వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. మిస్టర్ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందమైన ప్రేమ కథను... శ్రీనువైట్ల తనదైన స్టైల్లో కమర్షియాలిటీని ఎక్కడా మిస్ కాకుండా గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో... ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మంచి ఎమోషన్స్‌కి, హిలేరియస్ ఎంటర్‌టైనింగ్‌కి, మ్యూజిక్‌కి, విజువల్స్‌కు స్కోప్ ఉన్న కథ ఇది. స్పెయిన్‌లోని పలు అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశారు. అలాగే ఇండియాలోని చిక్ మంగళూర్, చాళకుడి, ఊటీ, హైదరాబాద్ ఏరియాల్లో ఒరిజినల్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. మిక్కి జె.మేయర్ ఆరు పాటలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ఈనెల 29న ఆడియోను రిలీజ్ చేసి... ఏప్రిల్ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.