టాలీవుడ్‌లో ఈ జనరేషన్ హీరోయిన్స్‌లో డాన్సింగ్ టాలెంట్ ఉన్న ముద్దుగుమ్మలు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మిల్కీ బ్యూటీ తమన్నా. ఆ తర్వాతి స్థానం తనదే అనిపించుకోవాలని ఉందంటోంది అందాల గోపిక పూజా హెగ్దే.
ఇటీవల ఈ ముద్దుగుమ్మ 'రంగస్థలం' సినిమాలో 'జిగేల్ రాణీ.. ' పాటకి ఆడి పాడిన విధానంలోనే ఆమెకు డాన్స్ పట్ల ఎంత ప్యాషన్ ఉందో అర్ధమవుతోంది. చరణ్‌తో డాన్సులేయడం అంటే, హీరోయిన్స్‌కి అంత ఈజీ కాదు. అలాంటిది మాస్ సాంగ్‌లో బీభత్సమైన మాస్ స్టెప్పుల్ని చరణ్‌తో పోటీ పడి మరీ చేసేసింది పూజా హెగ్దే. 'డీజె'లో అల్లు అర్జున్‌తో 'దేదె దేదెదే దేదె దేదె..' సాంగ్‌లో బన్నీకి పోటీగా పూజా వేసిన స్టెప్పులు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ కెవ్వు కేక.
ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తన టాలెంట్ చూపించబోతోంది. 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో ఎన్టీఆర్‌కి జోడీగా పూజా హెగ్దే నటిస్తున్న సంగతి తెలిసందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ బ్యూటీ ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన డాన్స్ చేసేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందట.
ఆ మాటకొస్తే డాన్సులో ఎన్ని లోతులున్నాయో, ఎన్ని ఎత్తులున్నాయో కనిపెట్టే దిశగా ప్రతీ సినిమాకీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందట పూజా హెగ్దే. అలాగే 'అరవింద సమేత' కోసం కూడా కొత్త కొత్త స్టెప్పుల్ని నేర్చుకోవడానికి ట్రై చేసిందట. అయితే ఈ సారి డాన్సుల్లో తనకి ఎన్టీఆర్ బాగా సహకరించాడని చెబుతోందీ బ్యూటీ పూజా హెగ్దే.