నేను చనిపోయాక కూడా నటిస్తా: బాబూమోహన్

మరిన్ని వార్తలు

సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వెళ్ళి అత్యద్భుతంగా రాణించిన అతికొద్దిమందిలో బాబూమోహన్ ఒకడు. ఈయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రలో MLAగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉన్నారు.

ఈ సమయంలో ఆయన మళ్ళీ తిరిగి సినిమాల్లో నటిస్తారా అని ఒకరు ప్రశ్నించగా- తాను ఎప్పటికి సినీ కళామతల్లికి రుణపడి ఉంటాను అని తన వృద్ధికి అదే కారణం అని అంటూ ఒక రేంజ్ లో సినీపరిశ్రమని ఆకాశానికెత్తేశాడు.

ఇక రాజకీయాల్లో బిజీ అవ్వడానికి కారణంగా సినిమాలకి దూరం అవుతాను అన్న రూమర్స్ లో నిజం లేవు అని అలాగే తాను నిజంగా చనిపోయి ఉన్నప్పుడు ఏదైనా సినిమాలో తన పాత్ర చనిపోయే సన్నివేశాన్ని అప్పుడు కూడా తీసుకునేలా దర్శక-నిర్మాతలకి చెబుతానని అన్నారు.

నిజజీవితంలో చనిపోయాక కూడా నటించేంత ఇష్టం ఈ తెలుగు చిత్రపరిశ్రమ అని ముగించాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS