ఆర్జీవీని ఇంకా వెంటాడుతున్న GST చిక్కులు

By iQlikMovies - April 04, 2018 - 15:37 PM IST

మరిన్ని వార్తలు

సంచలనాలకి కేర్ అఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీకి గాడ్ సెక్స్ & ట్రూత్ వీడియో ద్వారా వచ్చిన తలనొప్పులు ఇప్పుడిప్పుడే పోయేలా కనిపించట్లేదు.

మొన్నీమధ్యనే ఆయనని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణకి పిలిపించడం ఆయన నుండి ఈ వీడియోకి సంబంధించి వాంగ్మూలం తీసుకోవడం మనం చూసాము. ఇక తాజాగా మరోమారు ఆయనని పోలీసులు విచారణకి పిలిచే అవకాశాలు లేకపోలేదు అన్న వార్తలు వినపడుతున్నాయి.

ఈ కేసుకి సంబంధించి ఆ వీడియో షూటింగ్ హైదరాబాద్ లోనే జరిగింది అంటూ కొందరు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అందులో నిజానిజాలు తెలుసుకొని ఆయనని మరోమారు విచారణకి పిలిచే అవకాశం ఉంది అని అంటున్నారు.

ఆయనేమో తాను స్కైప్ ద్వారా ఈ వీడియో షూట్ చేయించాను అని చెప్పడం గమనార్హం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS