ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పిన 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' టీమ్.

By iQlikMovies - May 18, 2020 - 12:32 PM IST

మరిన్ని వార్తలు

మే 20.. ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' టీమ్ నుంచి ఓ టీజ‌రో, ఫ‌స్ట్ లుక్కో వ‌స్తుంద‌ని ఆశ ప‌డ్డారు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌. కానీ.. ఇప్పుడు అవేం రావ‌డం లేదు. లాక్ డౌన్ వ‌ల్ల ఎక్క‌డి ప‌నులు అక్క‌డే స్థంభించిపోయాయ‌ని, ఈ ప‌రిస్థితుల్లో ఎన్టీఆర్ టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డం కుద‌ర‌డం లేద‌ని ప్ర‌క‌టించింది ఆర్‌.ఆర్‌.ఆర్ బృందం. అభిమానుల కోసమ‌నో, ఇచ్చిన మాట కోస‌మ‌నో ఏదో ఓ టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌లేమ‌ని, అన్ని కుదిరిప్పుడు చ‌క్క‌టి టీజ‌ర్‌ని విడుద‌ల చేసి ఎన్టీఆర్ అభిమానుల్ని సంతోష‌పెడ‌తామ‌ని, టీజ‌ర్ విడుదలైన రోజునే అస‌లైన పండ‌గ అని ట్వీట్ చేసింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ‌కు లోన‌వుతున్నారు. టీజ‌ర్ రెడీ కాక‌పోతే.. క‌నీసం ఫ‌స్ట్ లుక్ అయినా చూపించొచ్చు క‌దా అని అడుగుతున్నారు. కానీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సైతం చిత్ర‌బృందం విడుద‌ల చేయ‌డం లేదు.

 

రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజున ఓ టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. నిజానికి అది కూడా లాక్ డౌన్ స‌మ‌య‌మే. కానీ అప్ప‌టికి చ‌ర‌ణ్ టీజ‌ర్‌కి కావ‌ల్సిన ఫుటేజ్ చిత్ర‌బృందం ద‌గ్గ‌ర అందుబాటులో ఉంది. దానికి ఎన్టీఆర్ వాయిస్ జ‌త చేసి టీజ‌ర్ వ‌దిలారు. స‌రిగ్గా.. ఎన్టీఆర్‌పుట్టిన రోజునాడూ అలాంటి టీజరే వ‌స్తుందిన ఆశించారు ఫ్యాన్స్‌. కానీ ఈ పుట్టిన రోజున మాత్రం అలాంటి గిఫ్టులేం ఉండ‌డం లేదు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూసే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS