సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఈమధ్య నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న నెక్స్ట్ సినిమాపై మాత్రం ప్రేక్షకుల్లో చెప్పుకోదగ్గ అంచనాలే ఉన్నాయి. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ రోర్ వీడియోతో ఒక్కసారిగా సినిమాపై అందరి దృష్టి పడింది. బోయపాటి మరోసారి బాలయ్యను పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేస్తున్నారని అందరికీ అర్థం అయింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు 'మోనార్క్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఈమధ్య జోరుగా ప్రచారం సాగింది. బాలయ్య బర్త్ డే సందర్భంగా టైటిల్ కూడా విడుదల చేస్తారని అన్నారు కానీ విడుదల చెయ్యలేదు. తాజా సమాచారం ప్రక్రారం బోయపాటి టీమ్ అదే టైటిల్ ను ఫైనలైజ్ చేసిందట. సినిమా కథకు బాలయ్య పాత్రకు టైటిల్ కరెక్ట్ గా సూట్ అవుతుందని అందరూ భావించారట. టైటిల్ కు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
త్వరలోనే టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించేందుకు బోయపాటి సన్నాహాలు చేసుకుంటున్నారట.