నయనతార - తమిళ దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఎప్పుడో పెళ్లి చేసేసుకున్నారని, ఆ విషయం ఇప్పటి వరకూ దాచి పెట్టారని తమిళ వర్గాలు గుసగుసలాడుకుంటుంటాయి. ఇద్దరూ ఎప్పుడు కనిపించినా అది హాట్ వార్తే. ఇప్పుడు విఘ్నేష్ ఓ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తుందని టాక్. మరో విశేషం ఏమిటంటే నయన కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతోందట. అంటే ఇది నయన - సమంతల లేడీ మల్టీస్టారర్ అన్నమాట.
సాధారణంగా లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే ఒకే ఒక్క కథానాయిక కనిపిస్తుంది. ఇద్దరు టాప్ హీరోయిన్లు ఓ నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రంలో కలసి నటించడం చాలా అరుదైన సంగతి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.