సంక్రాంతి బాలయ్యకు బాగా కలిసొచ్చే టైమ్. అయితే, ఆ టైమ్‌లో విడుదలైన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా లేకపోలేదు. అందుకే ఈ సారి సంక్రాంతిని బాలయ్య లైట్ తీసుకున్నాడనిపిస్తోంది. కె.ఎస్.రవికుమార్ - బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. దాదాపు చివరి దశకు చేరుకుంది ఈ చిత్రం. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాని మొదట్లో సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారట.
అయితే, ఆల్రెడీ సంక్రాంతి బరిలో బన్నీ 'అల వైకుంఠపురము'తో, మహేష్ 'సరిలేరు..'తో తిష్ట వేసుకుని కూర్చొన్నారు. అందుకే బాలయ్య ఇంకాస్త అప్డేట్ అయ్యి, తన సినిమాని సంక్రాంతి కన్నా ముందే, అంటే, డిశంబరులోనే విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడట. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు. కానీ, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ న్యూస్ లీక్ అయ్యి, వైరల్ అవుతోంది.
అన్నట్లు ఇదే కాంబినేషన్లో తెరకెక్కిన 'జై సింహా' గతంలో సంక్రాంతికే విడుదలైంది. కానీ, రిజల్ట్ ఆశించిన స్థాయిలో రాలేదు. బహుశా ఆ సెంటిమెంట్ కూడా బాలయ్య నిర్ణయాన్ని మార్చేసి ఉండొచ్చు. ఏది ఏమైతేనేం, ఈ ఏడాది మొదట్లో ఎన్టీఆర్ బయోపిక్‌తో వచ్చిన బాలయ్య దారుణమైన ఫెయిల్యూర్ చవిచూశాడు. ఇక ఇయర్ ఎండింగ్లో బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలిక.