నందమూరి బాలకృష్ణ నుంచి ఈ యేడాది ఇప్పటి వరకూ రెండు సినిమాలొచ్చాయి. ఒకటి కథానాయకుడు, రెండోది మహానాయకుడు. ముచ్చటగా మూడో సినిమానీ రంగంలోకి దింపేస్తున్నారు. మరి కొద్ది గంటల్లో `రూలర్` విడుదల కానుంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సి.కల్యాణ్ నిర్మాత. ఇందులో బాలకృష్ణ రెండు అవాతారాల్లో దర్శనమివ్వనున్నాడు. సీఈవోగా ఓ గెటప్‌లో స్టైలీష్‌గా కనిపిస్తుంటే, మరోవైపు పోలీస్ పాత్రలోనూ వీరంగం సృష్టించబోతున్నాడు.
మూడో గెటప్ కూడా ఉందని, అది సీక్రెట్ అని బాలయ్య చెబుతున్నాడు. అయితే ఈ కథ గజినిని పోలి ఉంటుందట. బాలయ్య గతం మర్చిపోవడం, మళ్లీ గుర్తుకురావడం.. ఈ మధ్యలో జరిగే నాటకీయ పరిణామలే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. తొలి భాగం అంతా... సీఈవోనే కనిపిస్తాడట. రెండో భాగంలో పోలీస్ ఎంట్రీ ఇస్తాడట. మరి గతం తాలుకూ.. కథేమిటో, ఈసినిమా భవిష్యత్తేమిటో తేలాలంటే.. రూలర్ రావాల్సిందే.