ట్రైలర్‌ టాక్‌: మత్తు వదిలించేలా ఉంది గురూ!

By Inkmantra - December 19, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా డెబ్యూ చేస్తున్న చిత్రం 'మత్తు వదలరా'. ఈ నెల 25న క్రిస్‌మస్‌ సందర్భంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్‌. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. డ్రగ్స్‌ అలవాటున్న ఓ కుర్రోడు.. అతనికి ఇద్దరు స్నేహితులు. ఏదో చేయాలనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లు, వారు చేసిన చిన్న దొంగతనం కాస్తా ఉరితాడులా వారి మెడకు చుట్టుకుని ఆ ముగ్గురి స్నేహితుల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది.

 

థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. కానీ ట్రైలర్‌ని కొత్తగా కట్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసిన చిత్ర యూనిట్‌, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది. ఈ జనరేషన్‌ యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసే అన్ని అంశాలూ ఈ సినిమాలో చక్కగా చొప్పించారు. సో యూత్‌ని 'మత్తు వదలరా' బాగానే ఎట్రాక్ట్‌ చేస్తుందంటున్నారు. తొలి సినిమానే అయినా, హీరో శ్రీ సింహా నటన ఆకట్టుకుంటోంది. డైలాగ్‌ డెలివరీ నుండి, బాడీ లాంగ్వేజ్‌ వరకూ అంతా ఈ జనరేషన్‌ కుర్రోళ్లను మెప్పించేలా ఉండడంతో, సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి.

 

అన్నట్లు ఈ సినిమాకి కీరవాణి మరో తనయుడు కాల భైరవ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. సత్య, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. యంగ్‌స్టర్‌ రితీష్‌ రానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS