ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ గెటప్ కంటే కూడా బాలకృష్ణ ప్రవర్తన ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. టాలీవుడ్లో ఇప్పుడున్న నలుగురు అగ్రహీరోల్లో బాలకృష్ణ ఒకరు. అయినా సరే ఆ గర్వాన్ని పక్కన పెట్టి వేదిక మీదికి ప్రతీ ఒక్కరినీ స్వయంగా చేయి పట్టుకుని తీసుకొచ్చారు. దాదాపుగా అందర్నీ స్వయంగా ఆయనే ఆహ్వానించడం గురించి ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.
మామూలుగా అయితే ఇలా ఆహ్వానం పలికేందుకు చాలా మంది ఉంటారు. అన్నీ తానై వ్యవహరించారు బాలయ్య. అంత పెద్ద హీరో అయ్యుండి మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించడం అంటే చిన్న విషయం కాదు. ఈ విషయంలో బాలయ్యను మెచ్చుకుని తీరాల్సిందే.
వేదిక మీద కృష్ణంరాజు, గీతాంజలి, జుమున లాంటి సీనియర్లు ఉన్నప్పుడు రకుల్ ప్రీత్‌సింగ్ తదితర జూనియర్లు ఉన్నప్పుడు బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌లో ఒకే తరహా హుందాతనం కనిపించింది. నవ్వుతూ మొత్తం కార్యక్రమాన్ని నడిపించారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో మాత్రమే కాదు, ఈ ఈవెంట్లో కూడా బాలయ్య హీరోయిజం పండించారు. హీరోయిజం అంటే హుందాతనం అని ప్రశంసలు అందుకుంటున్నారు.