సూపర్‌ స్టార్‌ కృష్ణతో నందమూరి బాల'కృష్ణుడు'!

మరిన్ని వార్తలు

అరుదైన కలయిక ఇది. చాలా చాలా అరుదైన కలయిక. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' ఆడియో, ట్రైలర్‌ లాంఛ్‌ కార్యక్రమానికి సూపర్‌ స్టార్‌ కృష్ణను ప్రత్యేకంగా ఆహ్వానించారు నందమూరి బాలకృష్ణ. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే బృహత్‌ కార్యక్రమం చేపట్టిన బాలకృష్ణ, ఈ క్రమంలో సూపర్‌ స్టార్‌ కృష్ణను ప్రత్యేకంగా కలవడం విశేషం కాకుండా ఎలా వుంటుంది.? ఒకప్పుడు ఎన్టీఆర్‌, కృష్ణ మధ్య మంచి పోటీ వుండేది.

 

ఇద్దరూ పోటీ పడి సినిమాలు చేసేవారు. 'అల్లూరి సీతారామరాజు' సినిమాని కృష్ణ కంటే ముందు ఎన్టీఆర్‌ అనుకున్నారు. చిన్న చిన్న పొరపచ్చాలు మినహాయిస్తే, అప్పట్లో హీరోల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. ఆ తరానికీ, ఈ తరానికీ వారధిగా వున్న సూపర్‌ స్టార్‌ని, బాలకృష్ణ కలవడాన్ని, ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఈవెంట్‌కి ఆహ్వానించడాన్నీ అభినందించి తీరాలి.

 

ఈ సందర్భంలోనే 'ఎన్టీఆర్‌ బయోపిక్‌' విశేషాల్ని, బాలకృష్ణ - సూపర్‌ స్టార్‌ కృష్ణకు వివరించారట. బాలయ్య ఆహ్వానం పట్ల సూపర్‌ స్టార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి కలయిక ఇప్పుడు నందమూరి అభిమానుల్లోనూ, ఘట్టమనేని అభిమానుల్లోనూ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' ఈవెంట్‌లో సూపర్‌ స్టార్‌ కృష్ణ కన్పిస్తే, ఆ పండుగ మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS