పెళ్లికి సిద్ధమైన మరో బాలీవుడ్‌ భామ.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌లో ముద్దుగుమ్మలు వరుసగా పెళ్లికూతుళ్లవుతున్నారు. నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒకింటివారవుతున్నారు. ఇటీవల దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రాలు ఇలా ప్రేమ, పెళ్లి సందడిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ముద్దుగుమ్మ పెళ్లికి సిద్ధమవుతోంది. ఆమె ఎవరో కాదు, కిమ్‌ శర్మ. 'ఖడ్గం' సినిమాలో శ్రీకాంత్‌కి జోడీగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో 'ముసుగు వేయద్దు మనసు మీద.. వలలు వేయద్దు వయసు మీద..' అంటూ జోష్‌ఫుల్‌ సాంగ్‌లో గ్లామర్‌తో మెరిసి, యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేసింది.

ఆ తర్వాత రామ్‌చరణ్‌తో 'మగధీర' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో దర్శనమిచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు కానీ, బాలీవుడ్‌లో సినిమాలు చేసింది. ఈ సంగతిటుంచితే, ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ప్రేమను దక్కించుకున్న ఆ అందగాడు ఎవరో తెలుసా.? తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అసలు సిసలు తెలుగబ్బాయ్‌. పేరు హర్షవర్ధన్‌ రాణే. 'అవును', 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి' తదితర సినిమాల్లో హీరోగా నటించాడు. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించిన హర్ష ఇప్పుడు ఈ బాలీవుడ్‌ భామతో ప్రేమలో పడిపోయాడు.

త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనున్న విషయాన్ని తాజాగా కన్‌ఫామ్‌ చేశారు. ఇదిలా ఉంటే, కిమ్‌శర్మకు గతంలోనే వివాహమైంది. మొదటి భర్తతో విడిపోయి, విడాకులు తీసుకున్నాక, హర్షతో ప్రేమలో పడింది. అయినా విడిపోవడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం బాలీవుడ్‌కి కొత్తేమీ కాదు, సైఫ్‌ అలీఖాన్‌, సంజయ్‌దత్‌ తదితరులు విడిపోయి మళ్లీ పెళ్లిళ్లు చేసుకున్నవారే. ప్రస్తుతం 'కెవ్కుకేక' బ్యూటీ మలైకా అరోరా, అర్జున్‌కపూర్‌తో ప్రేమాయణం నడిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS