ఎప్పటి నుండో నందమూరి వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, అవన్నీ కేవలం ఊహలకే పరిమితమవుతున్నాయి. ఎప్పుడో బాలయ్య నూరవ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. బాలయ్య మాత్రం సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే 105 వ సినిమా 'రూలర్' పూర్తి చేసేశారు. 106 వ సినిమా రేపో మాపో పట్టాలెక్కేయనుంది. కానీ, మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం షురూ కాలేదు.
తాజాగా ఇంకోసారి మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య పెదవి విప్పాల్సి వచ్చింది. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఆయన తెలిపారు. కానీ, ఖచ్చితంగా పలానా అప్పుడు వస్తాడని మాత్రం ఆయన గ్యారంటీ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం సినిమాల గురించి మోక్షజ్ఞ ఆరా తీస్తున్నాడు. సినిమాకి సంబంధించి ప్రతీ విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు.. అని మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి ఉందన్న విషయాన్ని బాలయ్య బయట పెట్టారు. అయితే, ప్రచారంలో ఉన్నట్లుగా మోక్షజ్ఞ నిజంగానే యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడా.? అనేది సస్పెన్సే.