హిట్టు మీద హిట్టు ఇస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తనకు మంచి పేరుంది. ప్రస్తుతం ఎఫ్ 3 పనుల్లో ఉన్నాడు రావిపూడి. అయితే నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. పటాస్ తరవాత.. ఆ ప్రయత్నాల్ని ముమ్మరం చేశాడు.కానీ వర్కవుట్ కాలేదు. ఎఫ్ 2 తరవాత బాలయ్యతో సినిమా దాదాపు ఓకే అయ్యింది. అప్పుడూ ఏదో అడ్డు కట్ట పడింది. ఇప్పటికి ఈ కాంబో ఫిక్సయిపోయింది.
అవును.. రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నాడు. సన్‌షైన్ పిక్చర్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. 2022 ప్రధమార్థంలో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఎఫ్ 3 తరవాత.. రావిపూడి సినిమా ఇదే. అయితే `అఖండ` తరవాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తాడు బాలయ్య. ఆ తరవాతే... అనిల్ ప్రాజెక్టు లోకి వస్తాడు. అనిల్ రావిపూడిది ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్. బాలయ్య కోసం కూడా అలాంటి కథే రాసుకున్నాడట. అయితే ఈ కథలో అభిమానులు కోరుకునే మాస్ అంశాలన్నీ ఉంటాయని తెలుస్తోంది.