బాలయ్య 'ఎన్టీఆర్' కి ఝలక్ ఇస్తున్న వివి వినాయక్

By iQlikMovies - November 01, 2018 - 17:49 PM IST

మరిన్ని వార్తలు

ఎన్నో అంచనాలు నడుమ నిర్మితమవుతున్న ఎన్టీఆర్ చిత్రం సంక్రాంతికి విడుదలకానుంది. ఇక ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖ నటీనటులు వివిధ ప్రముఖుల పాత్రలలో కనిపించనున్నారు.

ఇందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఒక ప్రముఖ దర్శకుడి పాత్రలో నటిస్తున్నాడట. ఇంతకి ఆ ప్రముఖ దర్శకుడు మరెవరో కాదు దర్శకరత్న దాసరి నారాయణరావు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరగుతున్నదట.

ఇక మరోవైపు ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. యూనిట్ సభ్యులు ఈ రెండు భాగాలు ముందుగా ప్రకటించిన ప్రకారమే విడుదలయ్యేలా ఏ ఇబ్బంది రాకుండా పనిచేసుకుంటూపోతున్నారు.

మొత్తానికి ఈ సినిమాలో నటిస్తున్న ప్రముఖుల జాబితాలో వి.వి. వినాయక్ కూడా చేరిపోయారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS