ఉవ్వెత్తున లేచిన ‘ఉప్పెన’.!

మరిన్ని వార్తలు

మెగా కాంపౌండ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ డెబ్యూ చేస్తున్న సినిమా ‘ఉప్పెన’ నుండి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చేశారు. అంచనాలకు మించి ఈ ఫస్ట్‌ సింగిల్‌ ఆకట్టుకుంటోంది. వినసొంపైన లిరిక్స్‌తో, ప్లెజెంట్‌ ఎట్మాస్పియర్‌ విజువల్స్‌తో రిలీజైన ఈ వీడియో సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఇంతవరకూ రిలీజ్‌ చేసిన ఫస్ట్‌లుక్స్‌ ఓ ఎత్తు. లేటెస్ట్‌ వీడియో సాంగ్‌ మరో ఎత్తు అనేలా ఉంది. కొత్త భామ కృతి శెట్టి సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అయ్యేలానే ఉంది. సొట్ట బుగ్గలతో క్యూట్‌ క్యూట్‌గా అలరిస్తోంది. ‘ఇష్క్‌ షిఫానా..’ అంటూ లవబుల్‌ హిందీ లిరిక్స్‌తో స్టార్ట్‌ అయిన ఈ సాంగ్‌ తర్వాత ‘నీ కన్ను నీలి సముద్రం.. అందుట్లో నా మనసు పడవ ప్రయాణం.. నీ నవ్వు ముత్యాల హారం.. అందుట్లో నేనేమో దారం దారం..’ అంటూ తెలుగు లిరిక్స్‌ అందుకుంది.

ఈ లిరిక్స్‌ మనసుకు హత్తుకుంటున్నాయి. హీరోయిన్‌ని చూస్తూ ఫీలయ్యే హీరో, హీరోయిన్‌ క్యూట్‌ అప్పీల్‌.. సాంగ్‌ని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లాయి. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, శ్రీమణి లిరిక్స్‌ అద్భుతంగా సెట్టయ్యాయి. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీస్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్‌ 2న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతోంది ‘ఉప్పెన’.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS